
వేములవాడ, వెలుగు: వచ్చే నెల 6న నిర్వహించనున్న సీతారాముల కల్యాణానికి భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్ సూచించారు. మంగళవారం రాజరాజేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్గెస్ట్ హౌస్‌లో ఆలయ ఉద్యోగులు, వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఆలయంలో నిర్వహించే రాములోరి కల్యాణానికి భక్తులు అధికంగా తరలివస్తారన్నారు. వేసవి దృష్ట్యా భక్తులకు ఏర్పాట్లు చేయాలన్నారు. తాగునీటి సరఫరా, క్యూలైన్ల ఏర్పాటు, శానిటేషన్, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఈవో వినోద్‌రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో ఈఈ రాజేశ్, డీఈ రఘునందన్, సీఐ వీరప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.